VIDEO: ఓడినందుకు డబ్బులు వసూలు
SDPT: వర్గల్ మండలం వేలూరు గ్రామపంచాయతీలో మొదటి విడత వార్డ్ మెంబర్ పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి తిమ్మాపురం నరసింహులు ఓటు కోసం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంచాడు. ఓడిపోవడంతో ఓటర్లను తిరిగి డబ్బులు అడిగి వసూలు చేశారు. సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ కావడంతో గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు.