VIDEO: దువ్వ హైస్కూల్ వద్ద భవానీలు నిరసన
W.G: తణుకు మండలం దువ్వ హైస్కూల్ వద్ద భవానీలు నిరసన చేపట్టారు. పాఠశాలలో భవానీ మాల వేసుకున్న విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవరిస్తున్నారంటూ కొందరు ఉపాధ్యాయులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో భవానీ మాలధారులు చేరుకుని విద్యార్థుల పట్ల ఉపాధ్యాయల ప్రవర్తనా తీరును ఖండిస్తూ, భజన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.