బహిరంగ వేలం వాయిదా: కమిషనర్

బహిరంగ వేలం వాయిదా: కమిషనర్

GNTR: ఈనెల 16వ తేదీన నగరంలో స్వచ్చ భారత్ మిషన్ బృందం పర్యటించనుంది. ఈ నేపథ్యంలో 16న జరగాల్సిన కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ బహిరంగ వేలాన్ని వారం రోజులు పాటు వాయిదా వేస్తున్నట్లు శనివారం కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. తదుపరి తేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. శ్రీ కృష్ణ కళ్యాణ మడపం, కాపు కమ్యునిటీ హాల్‌కు బహిరంగ వేలం ఉంటుందని పేర్కొన్నారు.