VIDEO: భక్తిశ్రద్ధలతో కోదండరాముడికి హరిద్రా ఘటనం

KDP: ఒంటిమిట్ట సీతారాముల కల్యాణోత్సవం ఈ నెల 11న జరగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో గురువారం హరిద్రా ఘటనం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోళ్ళు రోకళ్ళకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలు చేసి హరిద్రా ఘటనం (పసుపు కొమ్ములను దంచే) వేడుక నిర్వహించారు. TTD ఈవో శ్యామలా రావు సతీమణి పాల్గొని పసుపు కొమ్ములు దంచారు.