దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

TG: సంగారెడ్డి(D) జహీరాబాద్‌లో భర్త సిద్ధారెడ్డి భార్య కవితను హత్య చేశాడు. మార్చి 27న కవిత ప్రియుడితో వెళ్లిపోవడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలించారు. జడ్చర్లలో ప్రియుడుతో ఉన్నట్లు గుర్తించి.. జహీరాబాద్ తీసుకొస్తుండగా పోలీసులతో వెళ్లిన భర్త మార్గమధ్యంలో భార్యను కత్తితో పొడిచాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.