రేపు కోడుమూరులో జాబ్ మేళా

రేపు కోడుమూరులో జాబ్ మేళా

KRNL: కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 10న జాబ్ మేళా జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందని అన్నారు. పది నుంచి పీజీ ఉత్తీర్ణత కలిగి 18-30 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువతీయువకులు అర్హులని అన్నారు. విద్యార్హత సర్టిఫికెట్ ప్రతులు, రెజ్యుమ్, ఆధార్, రెండు ఫోటోలతో హాజరుకావాలన్నారు.