PGRS కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BPT: మార్టూరు మండలం ఇసుక దర్శిలోని తన క్యాంపు కార్యాలయంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.