బాబా శతాబ్ది ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
SKLM: ఆమదాలవలస మండలం వేనంపేట - అక్కులపేట గ్రామంలో శ్రీ సత్యసాయిబాబా శత వర్ష జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక సర్పంచ్ బొడ్డేపల్లి గౌరి పతి, కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, ఈ వేడుకలకు తప్పకుండా హాజరు అవ్వాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాబా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.