బస్సు కోసం గ్రామస్తుల నిరసన
GDWL: రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామస్థులు తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని ఆదివారం నిరసన చేపట్టారు. 75 ఏళ్లుగా బీటీ రోడ్డు వేయకపోవడంతో వర్షాకాలంలో నరకం కనిపిస్తోందని, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. బస్సులు రాకపోవడంతో మహిళలు మహాలక్ష్మి పథకానికి దూరమవుతున్నారని, విద్యార్థులు చదువులు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.