VIDEO: సంతకాల విజయవాడకు తరలించే వాహనం ప్రారంభం
NTR: తిరువూరులో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ర్యాలీ జరిగింది. వైసీపీ ఆధ్వర్యంలో సేకరించిన సంతకాల పత్రాలను విజయవాడకు తరలించే ప్రత్యేక వాహనాన్ని నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు.