గంజాయి సేవిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు

గంజాయి సేవిస్తున్న ఐదుగురిపై  కేసు నమోదు

NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. డీఎస్పీ శివరాం రెడ్డి ఆదేశాల మేరకు వేర్వేరు ప్రదేశాల్లో నిఘా పెట్టి గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించారు.