ఉప్పల్ GHMC గ్రౌండ్ క్లీనింగ్ ఎప్పుడు..?

ఉప్పల్ GHMC గ్రౌండ్ క్లీనింగ్ ఎప్పుడు..?

MDCL: ఉప్పల్ జిహెచ్ఎంసి మున్సిపల్ గ్రౌండ్ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇది అక్కడికి వెళ్తున్న వారు అంటున్న మాట. గ్రౌండ్ చుట్టూరా చెత్తాచెదారం కనిపిస్తుందని, మూలకు పడ్డ టాయిలెట్లు, సాయంత్రం 6 దాటితే విపరీతమైన దోమలు, సరిగ్గా వెలగని లైట్లతో ఇబ్బందులు పడుతున్నట్లుగా క్రీడాకారులు వాపోయారు. వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.