కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లపై పోలీసుల రైడ్స్
HYD: హబీబ్‌నగర్‌లోని 'షెహజాదా ఫుడ్ మాస్టర్' కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న మహమ్మద్ ఫారూఖ్‌ను అరెస్ట్ చేశారు. సింథటిక్ రంగులు, గమ్ పౌడర్‌ను ఉపయోగిస్తూ తయారు చేస్తున్న ఈ పేస్ట్‌ను హోల్సేల్ వ్యాపారులు, క్యాటరింగ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.