అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ

అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ

WNP: జిల్లాలో నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా వినోద్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకముందు రాష్ట్ర ఎన్నికల విభాగంలో పనిచేసి ప్రస్తుతం వనపర్తి జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌తో రెవెన్యూ విభాగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.