మే 1 నుంచి హౌసింగ్ సెన్సస్
PPM: మే 1 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఈ నెల 16 నుంచి 30 వరకు 'స్వీయ గణన' (Self Enumeration) అవకాశం కల్పించారు. ప్రజలు తమ ఇంటి వివరాలను స్వయంగా se.census.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చన్నారు.