హైదరాబాద్ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు
HYD: మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే నగరవాసులకు RTC శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్ JBS నుంచి వన జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మేనేజర్ ఎల్.రవీందర్ తెలిపారు. నేటి నుంచి జనవరి 31 వరకు 24 గంటల పాటు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్లాట్‌ఫాం నంబర్ 13 వద్ద బస్సులు ఉంటాయని వెల్లడించారు.