వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బదిలీలకు ఆదేశాలు

వైద్య ఆరోగ్య  శాఖ సిబ్బంది బదిలీలకు ఆదేశాలు

SKLM: వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సిబ్బందికి స్థానచలనం కలగనుంది. కార్యాలయంలో ప్రతి పనికి లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ పీజీఆర్ఎస్‌లో ఓ వైద్యాధికారి ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని బదిలీ చేయాలని డీఎంహెచ్‌వోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 45 మంది సిబ్బందిని బదిలీ చేయనున్నారు.