ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ.. ముగ్గురు సస్పెండ్
TG: జగిత్యాల జిల్లాలోని NPDCL కార్యాలయంలో కొంత మంది సిబ్బంది మద్యం బాటిళ్లతో పార్టీ చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మద్యం సేవించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ కావడంతో అసిస్టెంట్ లైన్‌మెన్ ప్రభాకర్‌తో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ.. ట్రాన్స్‌కో డివిజినల్ ఇంజినీర్ కె.గంగారాం ఉత్తర్వులు జారీ చేశారు.