మంత్రి అచ్చెన్నను కలిసిన డీసీసీబీ చైర్మన్ అవినాష్

SKLM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును నూతనంగా నియామకమైన డీసీసీబి ఛైర్మన్ చౌదరి అవినాష్ గురువారం తాడేపల్లిలోని కేంద్ర టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని మంత్రి ఆకాంక్షించారు. అవినాష్తో పాటు మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్, మాజీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాజ్జి, కూటమి నాయకులు ఉన్నారు.