VIDEO: శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే
NGKL: అచ్చంపేట మున్సిపాలిటీలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ మొదటి వార్డులో పర్యటించారు. కాలనీలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గౌరి శంకర్, కమిషనర్ మురళి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్ తదితరులు పాల్గొని పరిశుభ్రత పనులను ప్రారంభించారు.