సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
SKLM: మెలియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామపంచాయతీకి చెందిన గుమ్మడి యోగేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 5 లక్షల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తన కార్యాలయంలో గురువారం అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం ఆదుకుంటున్నానని అన్నారు. ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.