'ఫౌజీ'పై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు

'ఫౌజీ'పై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న పీరియడ్ వార్ డ్రామా 'ఫౌజీ'. ఈ మూవీలో తాను భాగమైనట్లు సీనియర్ నటి జయప్రద వెల్లడించింది. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని, ఇదొక గొప్ప అవకాశమని పేర్కొంది. దర్శకుడు రాఘవపూడి ఈ కథను ఒక విజువల్ వండర్‌లా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది.