షాద్ నగర్ లో కురుస్తున్న భారీ వర్షం

RR: జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షాద్‌నగర్ పట్టణంలో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారులపై వరద వచ్చి చేరుతోంది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.