ఏదీ రాజీవ్‌ యువ వికాసం..?

ఏదీ రాజీవ్‌ యువ వికాసం..?

BHNG: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువవికాసం పథకం అందని ద్రాక్షగానే మారింది. అగో ఇస్తం ఇగో ఇస్తం అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆపథకం ఊసే ఎత్తడం లేదు. గంపెడాశతో దరఖాస్తు చేసుకున్న యువత ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ప్రభుత్వం అమలు చేయడం లేదని ప్రచారం జరుగుతుంది.