భారీ వర్షాలపై కేసీఆర్ ఆందోళన

SDPT: భారీ వర్షాల వల్ల వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా సహా కామారెడ్డి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ వంతు సహకారం అందించాలని సూచించారు. పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.