భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

W.G: పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో నాగుల చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. సిద్ధాంతంలో కొలువైన నాగమ్మ తల్లి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి నాగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఏర్పాట్లు పర్యవేక్షించారు.