గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్

గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్

కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలం పెర్రీ రోడ్డులో ఆదివారం రాత్రి గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 900గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.