'త్వరలో రైతు బజార్ ప్రారంభం'
AKP: అనకాపల్లి పట్టణం ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో త్వరలో రైతు బజార్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శనివారం ఆ ప్రాంతంలో పర్యటించారు. రైతు బజార్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అలాగే వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.