కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ జయంతి
NZB: బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద శుక్రవారం కాంగ్రెస్ నాయకులు చాచా నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.