పర్యావరణ పరిరక్షణకు జ్యూట్ బ్యాగులు వాడాలి: కలెక్టర్

పర్యావరణ పరిరక్షణకు జ్యూట్ బ్యాగులు వాడాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం జ్యూట్ బ్యాగులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత జ్యూట్ బ్యాగులను ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్ బ్యాగులతో పర్యావరణానికి, భూమాతకు తీవ్రంగా నష్టం కలుగుతుందని చెప్పారు. కావున ప్రజలు పర్యావరణాన్ని పరిరక్షించడానికి జ్యూట్ బ్యాగులను ఉపయోగించాలన్నారు.