డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం
యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. లక్నో నుంచి కౌశాంబి జిల్లా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్‌ను చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో డిప్యూటీ సీఎంతో పాటు అందులోని వారంతో క్షేమంగా బయటపడ్డారు.