VIDEO: హిందూపురంలో చివరి రోజు గణనాథుడి ఊరేగింపు

VIDEO: హిందూపురంలో చివరి రోజు గణనాథుడి ఊరేగింపు

సత్యసాయి: హిందూపురం పట్టణం బాబూజీ నగర్‌లో గణేష్ నిమజ్జనం వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు సందర్భంగా గణేష్ విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం విగ్రహాన్ని గుడ్డం కోనేరుకు నిమజ్జనానికి తరలించారు.