శివరాత్రి వేళ ఈవోకు నిరసన సెగ
NDL: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. VIPల సేవలో తరిస్తూ సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదంటూ ఈవో శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేస్తున్నారు. పాగాలంకరణ చూసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. క్యూలైన్లు దాటి లోపలికి భక్తులు చొచ్చుకొచ్చారు. దీంతో పోలీసులు భక్తులకు కంట్రోల్ చేయలేకపోతున్నారు.