5,866 మంది విద్యార్థులకు మాత్రలు పంపిణీ

KMM: బోనకల్లు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో సోమవారం మండల అధికారులు నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ.. మండలంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలో 6,208 మంది పిల్లలకు గాను 5,866 మందికి ఈ మాత్రలను వేసినట్లు చెప్పారు.