VIDEO: వేద స్కానింగ్ సెంటర్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని వేద స్కానింగ్ సెంటర్‌లో డాక్టర్‌పై గత వారం దాడి చేసి గాయపరిచిన నిందితుడిని మంగళవారం సీఐ శ్రీనివాసరావు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.