OCP-5 ప్రాజెక్టును పరిశీలించిన కార్పొరేట్ సేఫ్టీ GM

PDPL: రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు- 5లో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి- ఉత్పాదకత పని స్థలాలను కార్పొరేట్ సేఫ్టీ GM చింతల శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టులో బ్లాస్టింగ్ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను ఆయన పరిశీలించి, అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట గోపాల్ సింగ్, సాయి ప్రసాద్, చంద్రశేఖర్, రమేశ్ ఉన్నారు.