పొదిలిలో భార్యను మోసం చేసి పరారైన భర్త

ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని చెప్పి వెళ్ళిన భర్త, తిరిగి పొదిలికి వచ్చి రూ.10 లక్షలు తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు బాధితురాలు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.