మేడారం PHCలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం

మేడారం PHCలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం

PDPL: ధర్మారం మండలం మేడారం PHCలో 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 8 నుంచి 31 వరకు మహిళలకు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం నిర్వహించబడుతుందని వైద్యాధికారులు డాక్టర్ అనుదీప్, డాక్టర్ సుస్మిత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక మైన మహిళలకు 30 రకాల పరీక్షలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. కావున మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.