ఏఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

ఏఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

కృష్ణా: ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతిని కల్పిస్తూ ఎస్పీ ఆర్. గంగాధరరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన కే.నాగరాజు, జే.ఎస్.ఆర్. ప్రసాద్ మచిలీపట్నంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. విధుల్లో నిబద్ధతతో వ్యవహరించి పోలీస్ శాఖకు గౌరవం తీసుకురావాలని ఎస్పీ సూచించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.