నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KDP: విద్యుత్ ఉపకేంద్రాల నిర్వహణ కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AP దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ కడప పరిధి ఈఈ హరి సేవియా నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కడప నగరంలోని జిల్లా న్యాయస్థానం మినహా అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గం నుంచి మధ్యాహ్నం 2 వరకు చెన్నూరు, వల్లూరు, పెండ్లిమర్రి, సిద్ధవటం తదితర మండలాల్లో అంతరాయం ఉంటుందన్నారు.