బహుమతులు అందజేసిన ఎంపీడీవో
KDP: సింహాద్రిపురం మండలంలో బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 11న పలు పాఠశాలల్లో క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మండల పరిధిలోని 9వ, 10వ తరగతి విద్యార్థినులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. సునీత, మమతా, చందన, పద్మావతి, అనిత, లావణ్య, భాగ్యలక్ష్మి విజేతలుగా నిలిచారు. విజేతలకు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేశారు.