VIDEO: రోడ్డు విస్తరణ.. లబోదిబోమంటున్న ప్రజలు
MHBD: ఆలేరులో రోడ్డు విస్తరణ పేరుతో ఇండ్లను కూల్చివేయడంపై ప్రజలు లబోదిబోమంటున్న ఘటన చోటు చేసుకుంది. ఆలేరు నుంచి చిన్నముప్పారం వెళ్లే రహదారి విస్తరణ కోసం కష్టార్జితంతో కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం ఏంటని, తాము ఇంటి పన్నులు కట్టామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు నిర్మించేటప్పుడు గ్రామ సెక్రెటరీ, గ్రామ సర్పంచ్ నోరు మెదపకుండా, ఇప్పుడు తమ పొట్ట కొట్టడం ఏంటని ప్రశ్నించారు.