'అంబేద్కర్ భవనం కోసం భూమిని కేటాయించాలి'
అన్నమయ్య: పీలేరులో అంబేద్కర్ భవనం కోసం భూమిని కేటాయించాలని డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ బాబుకు బుధవారం వినతి పత్రం అందజేసినట్లు మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరణి కుమార్, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గం ఇంఛార్జ్ వెంకటేష్ తెలిపారు. దొడ్డిపల్లి రెవిన్యూ గ్రామంలోని ప్రభుత్వ భూమిని అంబేద్కర్ భవన్‌కు కేటాయించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.