BREAKING: దిగ్గజ నటుడు కన్నుమూత
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. బాలీవుడ్ 'హీమ్యాన్'గా పేరొందిన ధర్మేంద్ర శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా ధర్మేంద్ర పేరుగడించారు. ఆయన్ను 2012లో పద్మభూషణ్ పురస్కారం వరించింది. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.