గంజాయి కేసులో తప్పించుకున్న ముద్దాయి అరెస్ట్

VSP: 2021లో ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఏ1 ముద్దాయి అన్బర్ ఖాన్‌ను రూరల్ ఎస్సై ఉపేంద్ర తన సిబ్బందితో కలిసి మధ్యప్రదేశ్‌లో పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం అతన్ని అరెస్ట్ చేసి విశాఖపట్నంలో కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఉత్తర్వుల మేరకు విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్లు రూరల్ ఎస్సై తెలిపారు.