నేడు పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సు
NGKL: నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈరోజు రాత్రి 8గంటలకు డిపో నుంచి బయలుదేరుతుంది. రేపు అమరేశ్వరుని దర్శనం, భీమవరం, ద్రాక్షారామం, పంచారామాలు, 16న అన్నవరం వ్రతాలు, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కల్పిస్తారు. వివరాలకు 9490411590, 9490411591 ఫోన్ చేయాలన్నారు.