రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులు

KRNL: చాగలమర్రి మండలంలోని చింతల్ చెరువు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికైనట్లు HM సుబ్బరాయుడు తెలిపారు. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి వెంకట్ రమణ సాఫ్ట్ బాల్ అండర్-17కు, 8వ తరగతి చదువుతున్నశ్రావణి, పల్లవి అండర్-14కు విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు.