మస్కట్లో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసి మృతి
NZB: ఆలూరు మండలానికి చెందిన ఆండ్రాసి మల్లయ్య ఉపాధి కోసం మస్కట్ వెళ్లారు. అక్కడ మంగళవారం సాయంత్రం రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. మల్లయ్య మరణంతో భార్య, ముగ్గురు కుమారులు అనాథలయ్యా రు. మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.