కల్లు తాగితే రూ. 5వేలు జరిమానా.. గ్రామస్తుల ఆగ్రహం
NZB: మోపాల్(M) సిర్పూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీల(VDC) నిర్ణయంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా గీత కార్మికులు వద్ద కల్లు తాగితే రూ.5 వేల జరిమానా విధిస్తామని VDC హెచ్చరికలు జారీ చేసింది. అయితే గతంలో గ్రామస్తులు కల్లు తాగకూడదని తీర్మానం చేయగా.. గీత కార్మికులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామస్తులకు అనుమతి ఇవ్వడంతో VDC ఈ నిర్ణయం తీసుకుంది.