తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'రాకాస' టీమ్
'రాకాస' మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిర్మాత కొణిదెల నిహారిక, నటీనటులు సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీను వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. వారు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం ఇచ్చారు.